నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్‌స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 2021లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో చైతూ, సాయిపల్లవి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా చైతూ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.
తాజాగా ఈ లవ్ ఎంటర్‌టైనర్‌ను మరోసారి బిగ్ స్క్రీన్‌పైకి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది వాలైంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని హీరో నాగచైతన్య ట్విటర్ ద్వారా వెల్లడించారు. నా హృదయానికి హత్తుకున్న సినిమా లవ్ స్టోరీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరోసారి థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ లవ్ స్టోరీ మూవీ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇది చూసిన అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. లవర్స్ డే రోజున థియేటర్లలో మరోసారి లవ్ స్టోరీ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
A film very close to my heart #LoveStory is Re-releasing on February 14th. Excited for this , looking forward to celebrating in theaters with you all again . #MagicalBlockBusterLovestory
@sekharkammula @Sai_Pallavi92 @SVCLLP @AsianSuniel #PusukurRamMohanRao#BharatNarang… pic.twitter.com/20uv8KrXiH— chaitanya akkineni (@chay_akkineni) January 22, 2026


