వరుణ్కి ఫిదా అంటున్న శేఖర్ కమ్ముల | Varun Tej Sekhar kammula movie title Fidha | Sakshi
Sakshi News home page

వరుణ్కి ఫిదా అంటున్న శేఖర్ కమ్ముల

Aug 5 2016 1:19 PM | Updated on Sep 4 2017 7:59 AM

వరుణ్కి ఫిదా అంటున్న శేఖర్ కమ్ముల

వరుణ్కి ఫిదా అంటున్న శేఖర్ కమ్ముల

లోఫర్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే నటుడిగా మంచి మార్కులు సాధించిన వరుణ్.. ఈ సినిమాతో...

లోఫర్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే నటుడిగా మంచి మార్కులు సాధించిన వరుణ్.. ఈ సినిమాతో కమర్షియల్ స్టార్గా  ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత మరోసారి ఓ కూల్ ఎంటర్టైనర్తో ఆడియన్స్ ముందుకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు వరుణ్.

కాఫీలాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించిన వరుణ్ తేజ్... ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసేస్తున్నాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా ఫైనల్ అయిపోగా హీరోయిన్గా మళయాల బ్యూటి సాయి పల్లివిని తీసుకున్నారు. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇక ఈ సినిమాకు ఫిదా అనే టైటిల్ను పరిశీలుస్తాన్నారన్న టాక్ వినిపిస్తోంది. వరుణ్తో పాటు శేఖర్ కమ్ముల కెరీర్కు కూడా ఈ సినిమా కీలకం కావటంతో ఈ కాంబినేషన్పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement