బాలీవుడ్లో హ్యాపిడేస్ | sekhar kammula bollywood debut | Sakshi
Sakshi News home page

బాలీవుడ్లో హ్యాపిడేస్

Jan 26 2016 11:06 AM | Updated on Sep 3 2017 4:21 PM

బాలీవుడ్లో హ్యాపిడేస్

బాలీవుడ్లో హ్యాపిడేస్

టాలీవుడ్లో కమర్షియల్ సినిమా హవా నడుస్తున్న సమయంలో కూడా కాఫీలాంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. సింపుల్ సబ్జెక్ట్లతో సున్నితమైన భావోద్వేగాలను...

టాలీవుడ్లో కమర్షియల్ సినిమా హవా నడుస్తున్న సమయంలో కూడా కాఫీలాంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. సింపుల్ సబ్జెక్ట్లతో సున్నితమైన భావోద్వేగాలను పలికించే శేఖర్ కమ్ముల తన రూటు మార్చి తెరకెక్కించిన అనామిక సినిమాతో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో గ్యాప్ తీసుకొని ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.

2007లో తన దర్శకత్వంలో తెరకెక్కి, సూపర్ హిట్ అయిన హ్యాపిడేస్ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం పూణే లోనే ఓ కాలేజ్ను సెలెక్ట్ చేసిన శేఖర్, ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. మార్చి నుంచి షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్న హ్యాపిడేస్ రీమేక్ను సల్మాన్ ఖాన్తో కలిసి శేఖర్ కమ్ముల స్వయంగా నిర్మిస్తున్నట్టుగా వార్తలు వినిపించినా చిత్రయూనిట్ మాత్రం అఫీషియల్గా కన్ఫామ్ చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement