శేఖర్‌ కమ్ములకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విజయ్ దేవరకొండ? | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda : శేఖర్‌ కమ్ములకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విజయ్ దేవరకొండ?

Published Fri, Nov 11 2022 4:39 PM

Buzz Is That Vijay Devarakonda Green Signal To Sekhar Kammula Film - Sakshi

ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. అర్జున్‌రెడ్డి సినిమాతో పాన్‌ ఇండియా క్రేజ్‌ను దక్కించుకున్న విజయ్‌కు లైగర్‌ డిజాస్టర్‌ ఊహించని విధంగా షాక్‌ ఇచ్చింది. దీంతో తాను తర్వాత చేయబోయే సినిమాల విషయంలో విజయ్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఇప్పటికే శివ నిర్వాణతో ఖుషి సినిమా చేస్తున్న విజయ్‌ ఈ సినిమా అనంతరం గౌతమ్‌ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా విజయ్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సినిమాకు సైన్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి చర్చలు పూర్తయ్యాయని, కథ నచ్చడంతో విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది. చదవండి: తన ఆరోగ్యంపై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ

Advertisement
 
Advertisement
 
Advertisement