Vijay Deverakonda On Recovery: Beast Is Dying To Come Out, Know His Health Condition - Sakshi
Sakshi News home page

Vijay Deverakonda : గాయం నుంచి కోలుకున్న విజయ్ దేవరకొండ.. అసలేమైందంటే

Nov 11 2022 12:25 PM | Updated on Nov 11 2022 12:51 PM

Vijay Deverakonda On Recovery: Beast Is Dying To Come Out - Sakshi

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ తన ఆరోగ్యంపై కీలక అప్‌డేట్‌ ఇచ్చాడు. ఎట్టకేలకు 8నెలల తర్వాత గాయం నుంచి కోలుకున్నట్లు తెలిపాడు. విజయ్‌కు కొన్నినెలల కొందట భుజానికి గాయం అయ్యింది. ఆ నొప్పితోనే లైగర్‌ షూటింగ్‌తో పాటు ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. అయితే చికిత్స అనంతరం ఇప్పుడు పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడినట్లు విజయ్‌ పేర్కొన్నాడు.

ఈ మేరకు ఓ ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘బీస్ట్ బయటకు రావడానికి ఉబలాటపడుతోంది. అది ఇంతకాలం పంజరంలో ఉండిపోయింది’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. సినిమాల్లోకి రాకముందే విజయ్‌కు షోల్డర్‌ ఇంజ్యురీ అయ్యిందట. లైగర్‌ షూటింగ్‌ సమయంలో ఆ గాయం మళ్లీ తిరిగబెట్టిందని సమాచారం. 

ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే కొంతవరకు షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. కానీ సమంత అనారోగ్యం కారణంగా కొద్ది రోజులు షూటింగ్‌కు బ్రేక్‌పడింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement