కుబేర మూవీ.. ఫుల్ ఎమోషనల్ సాంగ్‌ వచ్చేసింది! | Sekhar Kammula Kuberaa Movie Naa Koduka Lyrical Video song out now | Sakshi
Sakshi News home page

Kuberaa Movie: కుబేర మూవీ.. ఫుల్ ఎమోషనల్ సాంగ్‌ వచ్చేసింది!

Jun 18 2025 9:27 PM | Updated on Jun 18 2025 9:27 PM

Sekhar Kammula Kuberaa Movie Naa Koduka Lyrical Video song out now

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్, టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక రిలీజ్‌ ఒక్క రోజే సమయం ఉండడంతో మేకర్స్ కుబేర చిత్రంలో నాలుగో పాటను విడుదల చేశారు. నా కొడుకా అంటూ సాంగే లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్ చేశారు. ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతమందించగా.. నందకిశోర్ లిరిక్స్ అందించగా.. సిందూరి విశాల్ ఆలపించారు. ఈ ఎమోషనల్ సాంగ్‌ విడుదలైన కొద్ది సేపటికే ‍అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది.

కాగా.. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌ నటించగా.. బాలీవుడ్‌ నటుడు జిమ్‌ సర్బ్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.  అమిగోస్‌ క్రియేషన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్‌ఎల్‌పీ పతాకంపై సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్‌ మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా  తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం దేవి శ్రీ ప్రసాద్‌ అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement