'ఫిదా' బాన్సువాడ షెడ్యూల్ పూర్తి | 'Wrapped a super fun schedule of Fidaa in banswada' tweets Varun Tej | Sakshi
Sakshi News home page

'ఫిదా' బాన్సువాడ షెడ్యూల్ పూర్తి

Sep 8 2016 5:11 PM | Updated on Sep 4 2017 12:41 PM

'ఫిదా' బాన్సువాడ షెడ్యూల్ పూర్తి

'ఫిదా' బాన్సువాడ షెడ్యూల్ పూర్తి

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'ఫిదా' మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది.

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తాజా చిత్రం 'ఫిదా'  మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో 'ప్రేమమ్' ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్గా మెరవనున్నారు. ఎన్నారై కుర్రాడికి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

నిజామాబాద్ బాన్సువాడలో మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకున్నట్లు వరుణ్ తేజ్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలుకానుంది. శేఖర్ కమ్ముల మార్క్ స్వీట్ లవ్ స్టోరీగా 'ఫిదా' అలరించనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement