పాన్‌ ఇండియా సినిమా.. ఆసక్తిగా 'కుబేర' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ | Kubera Movie First Look Poster Out Now | Sakshi
Sakshi News home page

పాన్‌ ఇండియా సినిమా.. ఆసక్తిగా 'కుబేర' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Mar 9 2024 11:00 AM | Updated on Mar 9 2024 11:10 AM

Kubera Movie First Look Poster Out Now - Sakshi

ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రానికి టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. దీన్ని సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కుబేర అనే టైటిల్‌ను మేకర్స్‌ ఖరారు చేశారు. ఈమేరకు తాజాగా టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.  

ధనుష్‌ టైటిల్‌కు భిన్నమైన లుక్‌లో చిరిగిన బట్టలు, మాసిన జుట్టు, గుబురు గడ్డంతో ఆసక్తికరంగా కనిపించారు. అదే పోస్టర్‌లో ధనుష్‌ వెనక అన్నపూర్ణ దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా ఉన్న పెయింటింగ్‌ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తిరుపతి పరిసరప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ చిత్రీకరణను, గోవాలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్‌.  

కాగా ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్‌లోప్రారంభం కానుందని తెలిసింది. తాజాగా విడుదలైన పోస్టర్‌ను బట్టి  ఈ సినిమాలో ధనుష్‌, నాగార్జునల పాత్రలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement