ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డ్: శేఖర్ కమ్ముల కామెంట్స్ | Kuberaa Movie Director Sekhar Kammula Comments About Dhanush | Sakshi
Sakshi News home page

Sekhar Kammula: 'అతను తప్ప ఎవరూ చేయలేరు'.. శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్

Jun 2 2025 8:12 AM | Updated on Jun 2 2025 9:40 AM

Kuberaa Movie Director Sekhar Kammula Comments About Dhanush

నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.  ఈ మూవీని అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.

ఇకపోతే ఈ మూవీ రిలీజ్‌ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్‌ శేఖర్ కమ్ముల ఆసక్తికర కామెంట్స్ చేశారు. కోలీవుడ్‌ హీరో ధనుశ్‌పై ప్రశంసలు కురిపించారు.

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. టఈ సినిమాతో హీరో ధనుష్ మరో జాతీయ అవార్డ్ అందుకుంటారు. ఈ సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో మరో జాతీయ అవార్డు గెలుచుకుంటాడని భావిస్తున్నా. అతను తప్ప మరెవరూ ఈ పాత్రలో నటించలేరు" అని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు.  నాగార్జున మాట్లాడుతూ.. "ధనుష్ ఒక ఇంటర్నేషనల్ యాక్టర్. అతనిలో గొప్ప టాలెంట్ ఉంది. ధనుష్, శేఖర్ కమ్ముల.. మీరిద్దరూ నన్ను మళ్లీ ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు" అంటూ ప్రశ్నించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement