'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ | King Nagarjuna First Look From Kubera Movie | Sakshi
Sakshi News home page

'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌ రిలీజ్‌

May 2 2024 8:58 PM | Updated on May 2 2024 9:22 PM

King Nagarjuna First Look From Kubera Movie

ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా 'కుబేర'. ఈ సినిమా నుంచి ఇప్పటికే ధనుష్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. తాజాగా కింగ్‌ నాగార్జున లుక్‌ను మేకర్స్‌ రివీల్‌ చేశారు. ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

కుబేర సినిమాలో ధనుష్‌ కొంత సమయం పాటు రిచ్‌గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. కానీ, ధనుష్‌ ఫస్ట్‌ లుక్‌లో మాత్రం బిచ్చగాడి పాత్రలో కనిపించారు. నాగార్జున మాత్రం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం నాగార్జున అభిమానులతో పాటు ధనుష్ ఫ్యాన్స్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేస్తామని డైరెక్టర్‌ శేఖర్ కమ్ముల చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement