అందుకే 'లవ్‌స్టోరీ' చూడాలనే క్యూరియాసిటీ పెరిగింది. | Love Story: Reasons To Watch Naga Chaitanya, Sai Pallavi Love Story | Sakshi
Sakshi News home page

Love Story: ఈ కారణాల వల్లే లవ్‌స్టోరీ చూడాలనిపిస్తుంది..

Sep 23 2021 9:16 PM | Updated on Sep 23 2021 9:30 PM

Love Story: Reasons To Watch Naga Chaitanya, Sai Pallavi Love Story - Sakshi

Reasons To Watch Love Story Movie:  టాలీవుడ్‌ మోస్ట్‌ అవైటెడ్‌ సినిమాల్లో ‘లవ్‌స్టోరీ’ ఒకటి.  ఫిదా లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల నుంచి వస్తున్న మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్‌24న ప్రేక్షకల ముందుకు రానుంది. లవ్‌స్టోరీతో థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని సినీ ప్రముఖులు సైతం భావిస్తున్నారు. లవ్‌స్టోరీ సినిమా చూసేందుకు ఉన్న ప్రధాన కారణాలను ఓసారి పరిశీలిస్తే..

సాయి పల్లవికి సమానంగా..
సాయి పల్లవికి నటిగానే కాకుండా, మంచి డ్యాన్స్‌ర్‌గానూ పేరుంది. అందుకు తగ్గట్లుగానే ప్రతీ సినిమాలో అంతకంతకు ఢిపరెంట్‌ డ్యాన్స్‌ స్టెప్స్‌తో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. అయితే సాయిపల్లవికి సమానంగా నాగ చైతన్య డ్యాన్స్‌ ఉండనుందని ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మూవీలో సాయి పల్లవి కంటే నాగ చైతన్య డ్యాన్స్‌ చూసేందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. 

సెన్సిటివ్‌ సబ్జెక్ట్‌
లవ్‌స్టోరీ సినిమా పాటలు, టీజర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. కులం, పరువు హత్య లాంటి సెన్సిటివ్‌ అంశాలను తెరపై ఎలా చూపించారన్నది చాలామందిలో ఉన్న క్యూరియాసిటీ. 

శేఖర్‌ కమ్ముల స్టైల్‌
ఫీల్‌గుడ్‌ సినిమాలు తెరకెక్కించడంలో శేఖర్‌ కమ్ములది ఢిఫరెంట్‌ స్టైల్‌.  ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఆనంద్‌, గోదావరి, హ్యాపీడేస్‌ వంటి సినిమాలు ఎప్పుడూ చూసినా అదే ఫ్రెష్‌ ఫీల్‌ కలుగుతుంది. ఇదే ఆయన సినిమాల్లో మ్యాజిక్‌. అలాంటిది లవ్‌స్టోరీగా మన ముందుకు వస్తున్నారంటే కశ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పొచ్చు. 

చైతూ-పల్లవిల కెమిస్ట్రీ
నాగ చైతన్య, సాయి పల్లవి ఈ సినిమా కోసం తొలిసారి నటించారు. ట్రైలర్‌లో చూపించినట్లుగా ఇద్దరి మధ్యా వచ్చే డైలాగ్స్‌, కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా వర్కవుట్‌ అవుతుందని చాలామంది సినీ ప్రేక్షకుల ఫీలింగ్‌.

జుంబా డ్యాన్సర్‌గా నాగ చైతన్య
ఈ సినిమాలో నాగ చైతన్య గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది ఆయన డ్యాన్స్‌. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే, ఈ మూవీలో సాయి పల్లవి కంటే నాగ చైతన్య డ్యాన్స్‌ పైనే ఫోకస్‌ పెరిగింది. ఈ సినిమాలో చైతూ జుంబా ‍ డ్యాన్సర్‌గా కనిపించడం, తెలంగాణ యాస టచ్‌ చేయడంతో మరింత ఆసక్తి పెరిగింది. 

Advertisement
 
Advertisement
Advertisement