ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా | Karthika The Missing Case Movie Released In OTT, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

OTT Movie: మూడేళ్ల తర్వాత ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్

Jun 13 2025 11:20 AM | Updated on Jun 13 2025 11:57 AM

Karthika The Missing Case Movie Ott Streaming Details

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో చాలామంది చూసేవి థ్రిల్లర్స్. అందుకు తగ్గట్లే ఇతర భాషల్లో అలరించిన కొన్ని మూవీస్‌ని డబ్బింగ్ చేసి తెలుగులోనూ రిలీజ్ చేస్తుంటారు. అలా ఇ‍ప్పుడు ఓ తమిళ చిత్రాన్ని దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి తీసుకొచ్చారు. సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటా మూవీ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్)

2022లో తమిళంలో రిలీజై ఆకట్టుకున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'యుగి'. కథిర్, నరైన్, జోజూ జార్జ్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని ఇ‍ప్పుడు 'కార్తీక: మిస్సింగ్ కేస్' పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆహా ఓటీటీలోకి శుక్రవారం(జూన్ 13) నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్తీక అనే అమ్మాయి మిస్సింగ్ కేసుని ఛేదించే క్రమంలో ఓ డిటెక్టివ్ బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు ఆ అమ్మాయి దొరికిందా లేదా అనేదే మిగతా స్టోరీ.

ఇకపోతే ఇదే వీకెండ్‌లో ఈ సినిమాతో పాటు మరో 22 సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీల్లోకి వచ్చేయడం విశేషం. వీటిలో శుభం, కేసరి 2, ఏస్, ఎలెవన్, జింఖానా, బ్లైండ్ స్పాట్, సిన్, డియర్ ఉమ, డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవల్ చిత్రాలతో పాటు రానా నాయుడు 2 సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇ‍ప్పుడు చెప్పినవన్నీ కూడా తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీసే. ఈసారి థియేటర్లలో కొత్త సినిమాలేం రిలీజ్ కాలేదు కాబట్టి  ఓటీటీ మూవీస్‌పై తెలుగు ప్రేక్షకులు లుక్కేయడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌ను సీక్రెట్‌గా ఫాలో అవుతున్నా: అల్లు అరవింద్‌)

Advertisement
 
Advertisement
Advertisement