
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎపిసోడ్ మరోసారి హాట్టాపిక్గా మారింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సింగిల్గానే ఉంటోన్న సామ్.. ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఆమె బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా మెలగడమే. ఇప్పటికే పలుసార్లు జంటగా కనిపించిన వీరిద్దరు మరోసారి కెమెరాలకు చిక్కారు.
సామ్- రాజ్ నిడిమోరు ఓకే కారులో వెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో మరోసారి ఈ జంట గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని పలుసార్లు కథనాలొచ్చాయి. కానీ తమపై వస్తున్న వార్తలపై ఎవ్వరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. ఏదో ఒక సందర్భంలో వీరిద్దరు ఓకే వేదికపై తరచుగా కనిపిస్తూనే ఉన్నారు.
ఈ వీడియో చూస్తుంటే ఇద్దరు కలిసి ఓ రెస్టారంట్‌కు డిన్నర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. సమంత క్యాజువల్ వైట్ డ్రెస్‌లో నవ్వుతూ కనిపించారు. వీరిద్దరూ ఒకే కారులో ఇళ్లకు వెళ్లడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.కాగా.. రాజ్-డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2, సిటాడెల్: హనీ బన్నీలో సామ్ కనిపించింది. ఆ వెబ్ సిరీస్ల సమయంలోనే రాజ్‌తో పరిచయం ఏర్పడింది.