
ప్రస్తుత రోజుల్లో ఓటీటీలు సరికొత్త కంటెంట్తో సినీ ప్రియులను అలరిస్తున్నాయి. ఎక్కువగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్కు ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. ఓటీటీ ప్రియుల అభిరుచికి తగ్గట్టుగానే డిఫరెంట్ కంటెంట్తో వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగు మరో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ నెట్వర్క్. ఈ సిరీస్కు సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వం వహించారు. రమ్య సినిమా బ్యానర్‌పై లావణ్య యన్ఎస్, ఎంజి జంగం నిర్మించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆహా ఓటీటీలో ప్రసారమవుతోన్న ఈ వెబ్ సిరీస్‌ను ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.