
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) విరూపాక్ష, బ్రో చిత్రాల తర్వాత గతేడాది మరో మూవీని ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీతోనే మెగా హీరో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాం సాయి ధరమ్ తేజ్ కెరీర్లో 18వ సినిమాగా నిలవనుంది. ఈ చిత్రం ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇక సినిమా సంగతి పక్కనపెడితే సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) తాజాగా ఓ ఈవెంట్కు హాజరయ్యారు. మయసభ పేరుతో వస్తోన్న తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో ఒక సినిమా చేయాలని మయసభ డైరెక్టర్ దేవా కట్టను రిక్వెస్ట్ చేశానని మెగా హీరో అన్నారు. తన బ్యాడ్ టైమ్లో నాతో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దేవాకట్టా మాత్రమేనని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. 'దాదాపు 10 ఏళ్ల క్రితమే నా జర్నీ దేవాకట్టాతో స్టార్ట్ అయింది. మేమిద్దరం జిమ్లో కలిసేవాళ్లం. సార్ నాతో ఒక సినిమా చేయండని రిక్వెస్ట్ చేసేవాడిని. అలా చేస్తే చివరికీ రిపబ్లిక్ మూవీతో జతకట్టాం. నా బ్యాడ్ టైమ్లో నాకు వెలుగునిచ్చిన వ్యక్తి దేవాగారు. రిపబ్లిక్ సినిమా టైమ్లో నేను ఏదైతే క్లైమాక్స్ కోరుకున్నానో అదే ముందుకు తీసుకెళ్లారు దేవా కట్టా' అని తెలిపారు.
కాగా.. దేవా కట్ట డైరెక్షన్లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మయసభ. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కృష్ణమ నాయుడు, ఎంఎస్ రామిరెడ్డి పాత్రల్లో ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది.
A friendship tested by ambition.
A rivalry that redefined leadership.
A story that changed the fate of a state.#Mayasabha Trailer out now.#Mayasabha – A gripping political saga – Starts streaming from August 7th on @sonyliv@devakatta @AadhiOfficial @IamChaitanyarao pic.twitter.com/ZKMWVxqpei— Sony LIV (@SonyLIV) July 31, 2025