
టాలీవుడ్‌లో మరో విషాదం. కొన్నిరోజుల క్రితమే అనారోగ్య సమస్యలతో నటుడు ఫిష్ వెంకట్ చనిపోయారు. ఇప్పుడు విలనీ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న మరో నటుడు కారు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో తోటి నటీనటులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఇంతకీ ఏమైంది? ఎవరీ నటుడు?
(ఇదీ చదవండి: బర్త్‌డే ప్రకటన.. గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్)
పలు తెలుగు సినిమాల్లో విలన్ సహాయకుడిగా చేసిన భాను అలియాస్ బోరబండ భాను రీసెంట్‌గా ఓ స్నేహితుడు పిలవడంతో గండికోట వెళ్లాడు. అక్కడ ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆ ఫొటోలు, వీడియోలని ఇన్ స్టాలోనూ పోస్ట్ చేశాడు. అంతా పూర్తయిన కాసేపటికే తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో వీళ్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడికక్కడే భాను చనిపోయాడు.
భానుని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. భాను చేసే పాత్రలు విలనీ తరహాలో ఉన్నప్పటికీ ఆయన నిజ జీవితంలో చాలా సరదాగా ఉంటాడని, అందరితో కలిసిపోతాడని సహ నటీనటులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే భాను మృతి పట్లు ఆయన సోషల్ మీడియా ఫాలోవర్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.
(ఇదీ చదవండి: క్యాస్టింగ్‌కౌచ్ ఆరోపణలు.. నా కుటుంబాన్ని బాధించాయి: విజయ్ సేతుపతి)