‘కింగ్డమ్‌’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా! | Rashmika Mandanna Review On Vijay Devarakonda Kingdom Movie | Sakshi
Sakshi News home page

‘కింగ్డమ్‌’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా!

Jul 31 2025 2:49 PM | Updated on Jul 31 2025 2:55 PM

Rashmika Mandanna Review On Vijay Devarakonda Kingdom Movie

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్డమ్‌. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. భారీ అంచనాల మధ్య నేడు(జులై 31)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వినిపిస్తోంది. కథ-కథనం పక్కకి పెడితే..విజయ్‌ నటనపై మాత్రం ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానిస్టేబుల్సూరి పాత్రలో ఒదిగిపోయాడని, ఎమోషనల్సన్నీవేశాల్లో అద్భుతంగా నటించారని సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు. విజయ్అభిమానులు అయితే హిట్సినిమా అని సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

(కింగ్డమ్‌ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియా వేదికగా విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా నేషనల్క్రష్రష్మిక కూడా కింగ్డమ్ సినిమాపై తన రివ్యూ ఇచ్చేసింది. ‘ఇది నీకు(విజయ్‌), నిన్ను ప్రేమించిన వాళ్లకు ఎంత అర్థ అవుతుందో నాకు తెలుసు..మనం కొట్టినం’’ అని రష్మిక ఒక్క మాటతో సినిమా సూపర్‌ హిట్‌ అని చెప్పేసింది. కాగా, రష్మిక ట్వీట్‌పై విజయ్‌ స్పందించాడు. అవును ‘మనం కొట్టినం’అంటూ లవ్‌ సింబల్‌తో రిప్లై ఇచ్చాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement