
బాలీవుడ్ మూవీ 'వార్2' ఫ్యాన్స్‌కు మేకర్స్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. నేడు కియారా అద్వానీ పుట్టినరోజు కావడంతో మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ఈ భారీ యాక్షన్ సినిమా నుంచి ఏకంగా వీడియో సాంగ్ను విడుదల చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ క్రమంలో హృతిక్, కియారా అద్వానీల మధ్య క్రియేట్ చేసిన ఒక రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు.
హిందీ వర్షన్‌లో అమితాబ్ భట్టాచార్య రచించిన ఈ సాంగ్‌ను అర్జిత్ సింగ్, నిఖిత ఆలపించగా ప్రీతమ్ సంగీతం సమకూర్చారు. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని ‘కేసరియా...’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, తాజాగా విడుదలైన ఈ సాంగ్‌లో బికినీతో కనిపించిన కియారా పాన్ ఇండియా రేంజ్‌లో హీట్ పెంచేసింది. ఈ సినిమాలో ఆమె తొలిసారి బికినీలో కనిపించనుంది.