అలవాట్లకు బానిసవడం ఈజీయేమో కానీ దాన్ని వదిలించుకుని బయటకు రావడం కష్టం. కానీ, ఆ కష్టాన్ని తను జయించానంటోంది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్. మద్యపానం అనే వ్యసనం నుంచి ఎలా బయటకు వచ్చిందనే విషయాలను తాజాగా గుర్తు చేసుకుంది.
అదే పెద్ద విషయం
సునయన మాట్లాడుతూ.. సమస్యను అంగీకరించడం అన్నింటికంటే పెద్ద విషయం. ఒక్కసారి మనం తప్పు చేస్తున్నామని గుర్తించామంటే అక్కడే మార్పు మొదలవుతుంది. తిండి, మద్యపానం.. ఇతరత్రా ఎన్నో అలవాట్లు వ్యసనంగా మారుతుంటాయి. మనం అందులో పూర్తిగా మునిపోతున్నామన్నది మనకే అర్థం కాదు. నేను తాగుడుకు బానిసయ్యాను. తర్వాత ఒకానొక సమయంలో స్వీట్లు, జంక్ ఫుడ్ ఎక్కువ లాగించడం మదలుపెట్టాను.
ఒక్క అడుగు
వాటన్నింటినీ వదిలించుకోవడం, దూరం పెట్టడం అంత ఈజీ కాదు. ధృడ సంకల్పం, మనచుట్టూ ఉండేవారి సపోర్ట్‌తోనే వ్యసనాల నుంచి బయటకు రాగలం. ఒక్క అడుగు ముందుకేసి వాటిని జయించొచ్చు. భయపడకుండా ముందడుగు వేయండి. ఓపెన్‌గా మాట్లాడండి అని ఓ వీడియో షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు హృతిక్ రోషన్ స్పందిస్తూ లవ్యూ దీదీ అని కామెంట్ పెట్టాడు. తండ్రి రాకేశ్ రోశన్ సైతం నువ్వొక ఇన్‌స్పిరేషన్ అని కామెంట్ చేశాడు.
వ్యసనంగా..
గతంలోనూ సునయన తన తాగుడు వ్యసనం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. కొద్దిగా మొదలైన తాగుడు తర్వాత తీవ్రంగా మారిందని తెలిపింది. పొద్దున్నుంచి రాత్రి వరకు తాగడం ఒకటే పనిగా పెట్టుకున్నట్లు పేర్కొంది. అయితే మద్యపానం సేవించడం వల్ల తాను ఏం చేస్తున్నాననే విషయాలను కూడా మర్చిపోతున్నట్లు తెలిపింది. డీ అడిక్షన్ సెంటర్‌కు కూడా వెళ్లానని, చివరకు ఈ వ్యసనంపై విజయం సాధించానంది.
చదవండి: ఫలక్‌నుమాదాస్.. విశ్వక్‌తో ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఎవరంటే?


