బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా వాకింగ్ స్టిక్‌తో నడుస్తూ కెమెరాలకు చిక్కాడు. ముంబైలో నిర్వహించిన డైరెక్టర్ గోల్డీ బెహల్ పుట్టినరోజు వేడుకకు హృతిక్ చేతి కర్రతో హాజరయ్యాడు. సాధారణంగా ఇలాంటి పార్టీలకు వెళ్లినప్పుడు హృతిక్ హుషారుగా ఫోటోగ్రాఫర్లను పలకరిస్తూ వెళ్లేవాడు. కానీ ఈ సారి మాత్రం వాకింగ్ స్టిక్ సాయంతో సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోయాడు.
ఈ మధ్యే బర్త్ డే పార్టీలో ఫిట్‌గా కనిపించిన హృతిక్ రోషన్ ఇలా చేతి కర్రలతో నడుస్తూ కనిపించడం ఫ్యాన్స్‌లో ఆందోళన చెందుతున్నారు. ‘హృతిక్‌కు ఏమైంది?’ అంటూ ఆరా తీస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 'వార్ 2' సినిమాలోని ఒక సాంగ్ రిహార్సల్ సమయంలోనే హృతిక్ కాలికి గాయం అయినట్లు సమాచారం. హృతిక్ ప్రస్తుతం ‘క్రిష్ 4’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.


