‘దేవర 2’ సినిమా ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘దేవర’. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి దేవర, కొడుకు వర పాత్రల్లో నటించారు ఎన్టీఆర్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్, షైన్ టామ్ చాకో ఇతర కీలక పాత్రల్లో నటించారు.
నందమూరి కల్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం 2024 సెప్టెంబరులో విడుదలై విజయం సాధించింది. ఈ సినిమా ఎండింగ్‌లో ‘దేవర 2’ ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. తాజాగా ఈ సినిమా అప్‌డేట్‌ను వెల్లడించారు నిర్మాత మిక్కిలినేని సుధాకర్. ‘‘దేవర’ సీక్వెల్ పనులు ఈ ఏడాది మేలోప్రారంభం అవుతాయి. 2027లో ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అంటూ వెల్లడించారు. కాగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.


