
రష్మిక పేరు చెప్పగానే ఆమె సినిమాలతో పాటు హీరో విజయ్ దేవరకొండ కూడా గుర్తొస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారనే రూమర్స్ ఉన్నాయి. కాకపోతే మీడియా కంటపడకుండా సీక్రెట్‌గా విదేశాలకు వెళ్లి వస్తుంటారు. వ్యక్తిగతంగా ఫొటోలు షేర్ చేస్తారు తప్పితే జంటగా అస్సలు కనిపించారు. కానీ ఎవరో తీసిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. రీసెంట్ టైంలో మాత్రం రష్మిక కొద్దికొద్దిగా ఓపెన్ అవుతోంది. విజయ్‌పై తనుకున్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తోంది.
(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'పడక్కళమ్' రివ్యూ.. కన్ఫ్యూజన్ కామెడీ ఎంటర్‌టైనర్)
కొన్నిరోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్‌లో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని రష్మిక చెప్పింది. దీంతో అందరి చూపు విజయ్ దేవరకొండపై పడింది. తాజాగా 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ రష్మిక మాట్లాడుతూ విజయ్ దగ్గర నుంచి అన్నీ తీసేసుకుంటా అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఒకే కారులో జంటగా వెళ్తూ కనిపించారు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్.. ప్రేమని కన్ఫర్మ్ చేస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు.
కెరీర్ విషయానికొస్తే.. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో రష్మిక పాన్ ఇండియా సూపర్‌స్టార్ అయిపోయింది. ఈమె నటించిన 'కుబేర' రిలీజ్‌కి రెడీగా ఉంది. మరోవైపు గర్ల్‌ఫ్రెండ్, థామా తదితర సినిమాలు ఆల్రెడీ సెట్స్‌పై ఉన్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడక చాలా ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడు దృష్టంతా 'కింగ్డమ్'పైనే పెట్టుకున్నాడు. పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తున్న చిత్రం.. జూలై 25న ఎట్టకేలకు రిలీజ్ కాబోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?
(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. హిందీలో మరో సంచలనం)
Our favs #VijayDeverakonda and #RashmikaMandanna just got spotted together after ages!! My heart’s so full 😭❤️ pic.twitter.com/Ku1Z2Nv75J
— Lilly ✨ (@therwdygirl) June 18, 2025