విజయ్ దేవరకొండ నుంచి అన్నీ తీసేసుకుంటా: రష్మిక | Rashmika About Vijay Devarakonda Kubera Pre Release Event | Sakshi
Sakshi News home page

Rashmika: విజయ్ దేవరకొండపై ప్రేమ బయటపెట్టిన రష్మిక

Jun 15 2025 8:41 PM | Updated on Jun 15 2025 8:58 PM

Rashmika About Vijay Devarakonda Kubera Pre Release Event

విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు రష్మిక. వీళ్లిద్దరూ కలిసి రెండు సినిమాలు, అది కూడా చాలా ఏళ్ల క్రితం చేశారు. కానీ వీళ్ల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకోవడానికి ఓ కారణం ఉంది. అదే ప్రేమ. రష్మిక-విజయ్ చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు విదేశాలకు టూర్స్‌కి వెళ్తుంటారు. కొన్నాళ్ల ముందు వరకు తమ బంధం గురించి పెద్దగా స్పందించని రష్మిక.. రీసెంట్ టైంలో మాత్రం మెల్లమెల్లగా క్లూలు ఇస్తోంది.

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన 'కుబేర' ప్రీ రిలీజ్ ఈవెంట్‪‌లోనూ రష్మిక చిన్న హింట్ ఒకటి ఇచ్చేసింది. యాంకర్ సుమ.. ఈ సినిమాలో నటించిన ధనుష్, నాగార్జునలని కూడా పలు ప్రశ్నలు అడిగింది. రష్మికని మాత్రం ఫలానా హీరోల నుంచి ఏం కాపీ కొడతారు అని అడగ్గా.. నాగార్జున దగ్గర నుంచి ఛార్మ్, ధనుష్ దగ్గర సూర్యుడి కింద అయిన పనిచేసేలా బలం, అల్లు అర్జున్ దగ్గర నుంచి స్వాగ్, విజయ్ దేవరకొండ దగ్గర నుంచి మాత్రం అన్నీ కావాలి అని సమాధానమిచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఇది నా రిక్వెస్ట్.. గద్దర్ అవార్డుల వేడుకపై దిల్ రాజు

శేఖర్ కమ్ముల తీసిన 'కుబేర' సినిమా జూన్ 20న రిలీజ్ కాబోతుంది. ఇందులో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు. ధనిక-పేద, డబ్బు బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ తీశారు. ఇందులో రష్మిక పాత్ర ఎలా ఉండబోతుందనేది ఇప్పటివరకు అయితే పెద్దగా రివీల్ చేయలేదు. కానీ ప్రమోషన్స్‌లో మాత్రం ఈమె బాగానే పాల్గొంటుంది. మొన్నీమధ్య టీమ్‌తో కలిసి ముంబై కూడా వెళ్లొచ్చింది.

ఇక రష్మిక-విజయ్ దేవరకొండ బంధం విషయానికొస్తే.. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్లు మాత్రం అటు అవును అని గానీ ఇటు లేదు గానీ చెప్పకుండా అలా సస్పెన్స్ మెంటైన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రష్మిక.. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అదే రీతిన బ్లాక్‌బస్టర్ హిట్స్ కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉంది. విజయ్ దేవరకొండ మాత్రం 'కింగ్డమ్' మూవీని రిలీజ్‌కి రెడీ చేస్తున్నాడు. జూలై 4న విడుదల అన్నట్లు చెప్పారు గానీ ఈసారి కూడా వాయిదా పడటం గ్యారంటీ అంటున్నారు.

(ఇదీ చదవండి: హీరోయిన్ నివేదా థామస్ ఇంతలా మారిపోయిందేంటి?)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement