'మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌' ఆల్‌టైమ్‌ రికార్డ్‌ .. కలెక్షన్స్‌ ఎంతంటే? | Mahavatar Narsimha Movie Collection All Time Record Create | Sakshi
Sakshi News home page

'మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌' ఆల్‌టైమ్‌ రికార్డ్‌ .. కలెక్షన్స్‌ ఎంతంటే?

Aug 2 2025 1:50 PM | Updated on Aug 2 2025 3:01 PM

Mahavatar Narsimha Movie Collection All Time Record Create

'మ‌హావ‌తార్ న‌ర‌సింహ‌' యానిమేటెడ్‌ చిత్రం ఇండియన్బాక్సాఫీస్ను షేక్చేస్తుంది. ఎలాంటి తారాగణం లేకుండానే విడుదలైన చిత్రం అనేక రికార్డ్లను క్రియేట్చేసింది. కలెక్షన్ల పరంగా ఇప్పుడు ఏకంగా ఇండియన్ఆల్టైమ్రికార్డ్ను క్రియేట్చేసింది. 'మ‌హావ‌తార్' సినిమాటిక్ యూనివ‌ర్స్లో భాగంగా జులై 25 విడుదలైన చిత్రం చాలాచోట్ల థియేటర్స్‌ కూడా హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి. బుక్మైషోలో ఏకంగా ప్రతిరోజు రెండు లక్షలకు పైగా టికెట్లు తెగుతున్నాయి. క్లీమ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్ర‌ఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థ‌లు సంయుక్తంగా మూవీని నిర్మించాయి. తెలుగులో గీతా అర్ట్స్నుంచి అల్లు అరవింద్విడుదల చేశారు.

దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన 'మహావతార్ నరసింహ' సినిమాను చూసేందుకు పిల్లలు నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులు వెళ్తున్నారు. దీంతో 8రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 60.5 కోట్ల గ్రాస్కలెక్షన్స్రాబట్టింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా మార్కెట్లో విడుదలైన అన్ని యానినేషన్ సినిమాల తాలూకా వసూళ్ల రికార్డులను మహావతార్దాటేసింది. ఇండస్ట్రీలో ఆల్టైమ్రికార్డ్ను క్రియేట్చేసింది. ఇక ఈ సినిమా యూఎస్ మార్కెట్లో కూడా ఇదే రేంజ్ ఓపెనింగ్స్ సాధించింది. ఏకంగా వన్మిలియన్క్లబ్లో కూడా చేరింది. ప్రపంవ్యాప్తంగా అన్ని భాషలలో ఇప్పటికీ అదే స్ట్రాంగ్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇది డివైన్ బ్లాక్‌బస్టర్‌ అని చిత్ర మేకర్స్పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement