OTT: యానిమేటడ్ ఫాంటసీ మూవీ ‘విష్‌’ రివ్యూ | Wish Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Wish Movie Review: కోరిక మంచిదైతే ఎంత కష్టమైనా తీరుతుంది

Nov 19 2024 10:50 AM | Updated on Nov 19 2024 11:21 AM

Wish Movie Review In Telugu

మనకందరికీ విషెస్ ఉంటాయి. మన విష్ తీరాలని మనం ప్రతిరోజూ దేవుడిని కోరుకుంటాం. ఒకవేళ మన విష్ తీర్చే విజార్డ్ మనకు దొరికితే సూపర్ గా వుంటుంది కదా. అలాంటి కాన్సెప్ట్ తో తీసిన సినిమానే ఈ విష్. వాల్ట్ డిస్నీ ప్రొడ్యూస్ చేసిన ఈ యానిమేటడ్ ఫాంటసీ మూవీ హాట్ స్టార్ ప్లాట్ ఫాంలో స్ట్రీం అవుతోంది. క్రిస్బక్, ఫాం అనే ఇద్దరు డైరెక్టర్స్ ఈ మూవీని కలిసి తీశారు. 

ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే మెడిటేరియన్ సీ లోని ఓ ఐలాండ్ లో కింగ్ డమ్ ఆఫ్ రోజాస్ అనే రాజ్యం వుంటుంది. ఆ రాజ్యానికి రాజు మాగ్నిఫికో, రాణి అమాయ. మాగ్నిఫికో రాజు తన మంత్రశక్తితో నెలకోసారి తన ప్రజలకు సంబంధించి ఒక్క విష్ ను తీరుస్తూవుంటాడు. అది కూడా ఓ పెద్ద ఉత్సవం లా చేసి ఎవరికైతే విష్ కావాలో వాళ్ళని మాగ్నిఫికో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకుంటాడో వారి విష్ ను మాత్రం తీరుస్తాడు. 

అలాంటి టైంలో ఈ సినిమా హీరోయిన్‌ ఆషా తన తాత సబినో100th బర్త్ డే కి తాత విష్ కింగ్ గ్రాంట్ చేయాలని ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అవుతుంది. అయితే రాజు మాగ్నిఫికోకి తన తాత విష్ ను గ్రాంట్ చేయమని కోరుతుంది. దానికి మాగ్నిఫికో ఒప్పుకోడు. ఆషా ఈ విషయంలో బాగా బాధ పడి ఆకాశం లో వున్న స్టార్ ను తన విష్ ను గ్రాంట్ చేయమని ప్రే చేస్తుంది. అనుకోకుండా ఆషా కోసం స్టార్ ఒక బాల్ రూపంలో వచ్చి మాజిక్ చూపిస్తుంది. ఇంక మిగతా స్టోరీ అంతా స్టార్ మాజిక్ తో కింగ్ మాగ్నిఫికో ని ఆషా ఎలా ఎదుర్కుంటుందనేదే ఈ విష్ మూవీ. స్టన్నింగ్ మాజిక్ ఎఫెక్ట్స్ తో సూపర్ గ్రాండ్ విజువల్స్ తో విష్ మూవీ మీకు ఈ వీక్ సూపర్ ఎంటర్ టైనర్. గో అండ్ వాచిట్. 
- ఇంటూరు హరికృష్ణ

Advertisement
 
Advertisement
Advertisement