Spellbound Review : పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా | Spellbound Movie Review in Telugu | Sakshi
Sakshi News home page

Spellbound Review : పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా

Nov 30 2024 10:56 AM | Updated on Nov 30 2024 11:09 AM

Spellbound Movie Review in Telugu

అవాక్కవుతారు అంతే! చిన్నప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు కథలు చెప్తే ఎంచక్కా వినేవాళ్ళం. ఆ కథల్లో మనం ఎప్పుడూ చూడని మాయలు, ఎన్నడూ వినని అద్భుతాలు ఎన్నో ఉండేవి. అలాంటి కథలన్నీ అప్పుడప్పుడు సినిమా రూపంలో మన ముందుకు వస్తూ వున్నాయి. అటువంటి కథే ఈ ‘స్పెల్‌బౌండ్‌’. ఈ సినిమా సూపర్‌ యానిమేటెడ్‌ ఫాంటసీ కామెడీ మూవీ. అద్భుతమైన కథతో అంతకన్నా అద్భుతమైన విజువల్స్, క్యారెక్టర్స్‌తో సూపర్‌గా ఉంటుంది. దర్శకుడువిక్కీ జాన్సన్‌. స్పెల్‌బౌండ్‌ తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ కూడా ఉంది. ఇది నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతోంది. 

ఇక కథ విషయానికొస్తే.. మ్యాజికల్‌ కింగ్‌డమ్‌ అయిన లుంబ్రియాలో రాజు, రాణి డార్క్‌ మేజిక్‌ వల్ల మాన్స్‌టర్స్‌గా మరిపోతారు. వారిద్దరి కుమార్తె అయిన ఎలెన్‌ తన తల్లిదండ్రుల గురించి దిగాలు పడుతుంది. రాజ్యంలో ఎవ్వరికీ ఈ విషయం తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతుంది. అయితే ఈ విషయంలో సన్‌ అండ్‌ మూన్‌కి సంబంధించిన ఒరకిల్స్‌ అయిన సన్నీ అండ్‌ లూనో సహాయం కోరుతుంది ఎలెన్‌. వాళ్ళు లుంబ్రియా కి వచ్చి ఎలెన్‌ తల్లిదండ్రులను చూసి భయపడిపోతారు. ఎలెన్‌ ఈ విషయంలో బాధపడి ఈసారి వాళ్ళున్న చోటికే తన తల్లిదండ్రులను తీసుకువెళుతుంది. 

మరి ఒరకిల్స్, ఎలెన్‌ తల్లిదండ్రులను మార్చగలిగారా లేదా అన్నది స్పెల్‌బౌండ్‌ సినిమాలోనే చూడాలి. ఈ సినిమా మంచి కథతో పిల్లలను చక్కగా ఆకట్టుకుంటుంది. అలాగే సినిమా ఆఖర్లో పేరెంట్స్‌కు మంచి మెసేజ్‌ కూడా ఉంది. అందుకే ఈ స్పెల్‌బౌండ్‌ పిల్లల సినిమానే కాదు పెద్దవాళ్ళు కూడా చూడాల్సిన సినిమా. సో కిడ్స్‌ గ్రాబ్‌ యువర్‌ రిమోట్‌ ఎలాంగ్‌ విత్‌ యువర్‌ పేరెంట్స్‌ టు బి స్పెల్‌బౌండ్‌ బై స్పెల్‌బౌండ్‌ మూవీ. – ఇంటూరి హరికృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement