breaking news
All Time Blockbuster
-
'మహావతార్ నరసింహ' ఆల్‌టైమ్ రికార్డ్ .. కలెక్షన్స్ ఎంతంటే?
'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఎలాంటి తారాగణం లేకుండానే విడుదలైన ఈ చిత్రం అనేక రికార్డ్లను క్రియేట్ చేసింది. కలెక్షన్ల పరంగా ఇప్పుడు ఏకంగా ఇండియన్ ఆల్‌టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. 'మహావతార్' సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా జులై 25న విడుదలైన ఈ చిత్రం చాలాచోట్ల థియేటర్స్ కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. బుక్‌మైషోలో ఏకంగా ప్రతిరోజు రెండు లక్షలకు పైగా టికెట్లు తెగుతున్నాయి. క్లీమ్ ప్రొడక్షన్స్, ప్రఖ్యాత హోంబలే ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. తెలుగులో గీతా అర్ట్స్ నుంచి అల్లు అరవింద్ విడుదల చేశారు.దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన 'మహావతార్ నరసింహ' సినిమాను చూసేందుకు పిల్లలు నుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులు వెళ్తున్నారు. దీంతో 8రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 60.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా మార్కెట్లో విడుదలైన అన్ని యానినేషన్ సినిమాల తాలూకా వసూళ్ల రికార్డులను మహావతార్ దాటేసింది. ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా యూఎస్ మార్కెట్లో కూడా ఇదే రేంజ్ ఓపెనింగ్స్ సాధించింది. ఏకంగా వన్ మిలియన్ క్లబ్లో కూడా చేరింది. ప్రపంవ్యాప్తంగా అన్ని భాషలలో ఇప్పటికీ అదే స్ట్రాంగ్ బుకింగ్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇది డివైన్ బ్లాక్‌బస్టర్ అని చిత్ర మేకర్స్ పేర్కొన్నారు.The divine roar has echoed across the nation 🦁#MahavatarNarsimha has roared past all records, grossing ₹60.5 CRORES+ in just 8 DAYS to become India’s Highest-Grossing Animated Film of All Time 💥💥#Mahavatar @hombalefilms @AshwinKleem @kleemproduction @VKiragandur @ChaluveG… pic.twitter.com/kAJNJRlPsY— Hombale Films (@hombalefilms) August 2, 2025 -
చైనాలోనూ... 100 కోట్లు పీకేశారు!
ఆమిర్ ఖాన్ నటించిన ‘పీకే’ చిత్రం మనదేశంలోనే కాదు... ఇప్పుడు విదేశంలోనూ సంచలనం రేపుతోంది. చైనాలో ఏకంగా రూ. 100 కోట్ల వసూళ్ళు సాధించి, కొత్త చరిత్ర సృష్టించింది. గత ఏడాది మన దగ్గర వసూళ్ళ వర్షం కురిపించిన ‘పీకె’ ఆలస్యంగా ఈ మధ్యే చైనాలో రిలీజైంది. కేవలం పదహారు రోజుల్లో అక్కడ ‘ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్’ భారతీయ సినిమాగా నిలిచింది. మన కరెన్సీ లెక్క ప్రకారం వంద కోట్ల పైగా వసూలు చేసింది. మన దేశంలో పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్న గాడ్‌మెన్ సంస్కృతిపై వ్యంగ్యబాణాలు విసురుతూ, రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ‘పీకే’ ఎన్నో నిరసనలు తట్టుకొని, మన దేశంలోని భారీ కమర్షియల్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు చైనాలోనూ కాసులు కురిపిస్తూ, ఆ ఘనత సాధించిన అతి కొద్ది హిందీ చిత్రాల్లో ఒకటైంది.