చెప్పు తెగుద్ది.. అంటూ భగ్గుమన్న అనసూయ (వీడియో) | Anasuya Strong Warning In Markapur | Sakshi
Sakshi News home page

చెప్పు తెగుద్ది.. అంటూ భగ్గుమన్న అనసూయ (వీడియో)

Aug 2 2025 11:47 AM | Updated on Aug 2 2025 1:53 PM

Anasuya Strong Warning In Markapur

టాలీవుడ్ న‌టి, యాంక‌ర్ అన‌సూయ ఫైర్అయ్యారు. కొందరు ఆకతాయిలు చేసిన చిల్లర కామెంట్లకు చెప్పు తెగుద్ది అంటూ ఆమె బహిరంగంగానే వార్నింగ్ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్లోని ప్ర‌కాశం జిల్లా మార్క‌పూరంలోని ఓ షాపింగ్‌మాల్ ఓపెనింగ్‌లో అనసూయ పాల్గొన్నారు. దీంతో ఆమెను చూసేందుకు భారీగా జనాలు చేరుకున్నారు. ఆమె మాట్లాడుతుండగా కొంద‌రు ఆక‌తాయిలు అనసూయకు వినిపించేలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె గట్టిగానే సమాధానం ఇచ్చింది

ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే చెప్పు తెగుద్ది.. అంటూ గడ్డిపెట్టారు. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య కుటుంబ‌స‌భ్యుల‌పై ఎవరైనా ఇలాంటి కామెంట్లు చేస్తే ఊరుకుంటారా..? అంటూ ప్రశ్నించారు. పెద్ద‌వాళ్ల‌కి మ‌ర్యాద ఇవ్వ‌డం మీ ఇంట్లో నేర్పలేదా అంటూ ఆమె ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని, వారు చాలా హానికరమన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్అవుతుంది. అయితే, ఆ సమయంవలో అనసూయకు మద్ధతుగా చాలామంది నిలిచినట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement