రష్మిక మూవీకి ఆల్‌ ది బెస్ట్ చెప్పిన విజయ్ దేవరకొండ! | Vijay Deverakonda post All the Best For Rashmika Mandanna Latest Movie | Sakshi
Sakshi News home page

Rashmika: ఆ పేరు చాలా స్పెషల్.. రష్మిక మూవీపై విజయ్ దేవరకొండ..!

Jun 17 2025 8:00 PM | Updated on Jun 17 2025 8:12 PM

Vijay Deverakonda post All the Best For Rashmika Mandanna Latest Movie

నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కుబేర’.  రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో ధనుశ్‌ బిచ్చగాడి పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ధనిక-పేద తేడా, రూ.10 వేల కోట్ల స్కామ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది . సునీల్‌ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయబోతున్న కుబేర చిత్రానికి అభినందనలు తెలిపారు. శేఖర్ కమ్ముల సర్ పేరు నా ప్రయాణంలో ఎల్లప్పుడూ ప్రత్యేకం.. నాలాంటి చాలా మంది నటులకు ఆయనే ఆదర్శమని కొనియాడారు. ఈ మూవీలో ధనుశ్, నాగార్జున సర్, రష్మిక లాంటి స్టార్లను చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కుబేర టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ అంటూ పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఇక వేచి ఉండలేను అంటూ రాసుకొచ్చారు. రష్మిక మూవీకి విజయ్ దేవరకొండ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడంపై అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement