పావలా శ్యామలకు సాయిధరమ్‌ తేజ్‌ ఆర్థిక సాయం | Sai Dharam Tej Help To Pavala Shyamala | Sakshi
Sakshi News home page

పావలా శ్యామలకు సాయిధరమ్‌ తేజ్‌ ఆర్థిక సాయం

Jul 26 2024 6:32 PM | Updated on Jul 26 2024 6:54 PM

Sai Dharam Tej Help To Pavala Shyamala

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ మంచి మనసు చాటుకున్నారు. సీనియర్‌ నటి పావలా శ్యామల కష్టాల్లో ఉన్నట్లు తెలుసుకున్న ఆయన చలించిపోయారు. సాయం చేస్తానని గతంలో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పలు ఆరోగ్య సమస్యల వల్ల వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న పావలా శ్యామాలకు రూ. లక్ష సాయం చేశారు. తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ద్వారా ఆ డబ్బును ఆమెకు అందించారు.

పావలా శ్యామలతో సాయిధరమ్‌ తేజ్‌ కూడా వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 'గతంలో మా అమ్మాయికి ఆపరేషన్‌ అయిన సమయంలో సాయిధరమ్‌ తేజ్‌ నాకు ఫోన్‌ చేసి చాలా ధైర్యం చెప్పారు. త్వరలో వచ్చి కలుస్తానని చెప్పారు. కానీ, ఆయన రాలేదు. చాలా రోజులైపోయింది కాబట్టి నన్ను మర్చిపోయారనుకున్నాను. ఆయనకు ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా బయటపడాలని దేవుడిని కోరుకున్నాను. దేవుడి దయ వల్ల అంతా మంచే జరిగింది. అయితే, నన్ను గుర్తుపెట్టుకొని సాయం చేసినందుకు తేజ్‌కు నా ధన్యవాదాలు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బు లేదు. 

దీంతో నా కూతురితో సహా చనిపోదామనుకున్నా..సమయానికి మీరు సాయం చేసి నాకూ, నా కూతురుకు ప్రాణభిక్ష పెట్టారు. అని సాయ్‌ ధరమ్‌ తేజ్‌తో వీడియో కాల్‌ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌కు రూ.5 లక్షలు సాయిధరమ్‌తేజ్‌  విరాళం ఇచ్చారు. దానిలో భాగంగా రూ.లక్షను పావలా శ్యామలకు అందించారు. గతంలో మెగాస్టార్‌ చిరంజీవి చేసిన సాయాన్ని కూడా ఆమె మరోసారి గుర్తుచేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement