
శ్రీ శారద రమణా క్రియేషన్స్ బ్యానర్‌పై నంద కిషోర్ నిర్మిస్తున్న సినిమా 'చేతబడి'. కొత్త దర్శకుడు సూర్యాస్ ఈ మూవీని నిజజీవిత సంఘటనల ఆఘారంగా తెరకెక్కించారు. తాజాగా లుక్ రిలీజ్ చేయడంతో పాటు చిత్ర విశేషాలని దర్శకుడు మీడియాతో పంచుకున్నాడు.
చేతబడి.. 16వ శతాబ్దంలో మన దేశంలో పుట్టింది. రెండు దేశాలు కొట్టుకోవాలన్న రెండు దేశాలు కలవాలన్నా.. ఒక బలగం ఉండాలి. కానీ ఒక చెడు శక్తితో మనిషిని కలవకుండా అతన్ని చంపే విద్యే చేతబడి. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. ఇందులో చాలా విభిన్నంగా చూపిస్తున్నాం. మన శరీరంలో ప్రతిదానికి ఓ ప్రాణం ఉంటుంది. జుట్టుకు కూడా ఒక ప్రాణం ఉంటుంది. ఆ వెంట్రుకల ఆధారంగానే ఈ సినిమా ఆధారపడి ఉంటుందని సూర్యాస్ తెలిపాడు.
1953 గిరిడ అనే గ్రామంలో యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని ఈ కథని సిద్ధం చేశారు. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం వెదురు బొంగులు చాలా దట్టంగా ఉంటాయి. వర్షం పడినా అవి నెలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇందులో చూపించబోతున్నామని దర్శకుడు సూర్యాస్ చెప్పుకొచ్చాడు.