
కన్నడ నటి 'రచితా రామ్' పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో విడుదలైన 'కూలీ' సినిమాలో 'కల్యాణి'గా ఆమె దుమ్మురేపింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే, ఆమె ఇప్పుడు మరో ఘనతను సాధించింది. టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌లో ఆమె చేరారు. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ(IMDb) దశాబ్దకాలంగా ఎక్కువ ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా రచితా రామ్ ర్యాంక్‌ను ప్రకటించింది.

కూలీ సినిమా తర్వాత రచితా రామ్ ఎక్కువ ప్రజాదరణ పొందిన తారగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఐఎండీబీ విడుదల చేసిన రేటింగ్‌లో ఆమె ఏకంగా 37వ ర్యాంక్‌లో నిలిచింది. అయితే, ఆమె గతంలో 392 ర్యాంక్‌లో ఉండేది. కూలీ సినిమా తర్వతా ఏకంగా 250 మందిని దాటుకొని ముందుకు దూసుకొచ్చింది. కానీ, శ్రుతి హాసన్ 44వ ర్యాంక్‌లో నిలిచింది. అయితే, ఆమె గతంలో 95వ ర్యాంక్‌లో కొనసాగింది.
రచితా రామ్ 2013లో మొదటిసారి దర్శన్‌తో 'బుల్ బుల్' చిత్రం ద్వారా వెండితెరపై మెరిసింది. ఈ మూవీ భారీ విజయం కావడంతో ఆమెకు ఆఫర్లు క్యూ కట్టేశాయి. ఈ మూవీ తర్వాత 'డింపుల్ క్వీన్'గా కన్నడలో గుర్తింపు పొందింది. ఆపై తన నటనకు గాను ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు మూడు సైమా అవార్డులను సొంతం చేసుకుంది. అయితే, ఆమె పాఠశాల విద్య వరకు మాత్రమే చదువుకుంది. ఆమె ఇప్పటి వరకు పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర, దునియా విజయ్ వివేక్ ఒబేరాయ్ వంటి స్టార్స్‌తో నటించింది. తెలుగులో చిరు మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్‌తో 'సూపర్ మచ్చి' సినిమాలో నటించింది.
— Rachita Ram (@RachitaRamDQ) August 22, 2025