
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా (Coolie Movie)పై భారీ అంచనాలే ఉన్నాయి. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలు భాగం కావడంతో కూలీ మూవీ గురించి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కానుంది. శుక్రవారం ఈ చిత్రం నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ అందించిన మోనికా అనే ఐటం సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో పూజా హెగ్డే అందంతో, డ్యాన్స్‌తో అదరగొట్టింది.
అప్పుడు జిగేలు రాణి.. ఇప్పుడు మోనికా
ఇలా స్పెషల్ సాంగ్స్ చేయడం పూజకు కొత్తేమీ కాదు. గతంలో రంగస్థలం మూవీలో జిగేలురాణి పాటకు సూపర్‌గా డ్యాన్స్ చేసింది. ఎఫ్ 3 మూవీలోనూ లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా పాటతో ఆకట్టుకుంది. తెలుగులో ఆమె కనిపించిన చివరి సినిమా అదే! ఇటీవల తమిళ రెట్రో మూవీలో కథానాయికగా అలరించింది. కన్నిమా పాటకు ఎక్స్‌ప్రెషన్, గ్రేస్‌తో అదరగొట్టేసింది. ఇప్పుడు కూలీలో మోనికాగా సెన్సేషన్ సృష్టిస్తోంది.
దడదడలాడించిన సౌబిన్
అయితే ఈ పాటలో మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ (Soubin Shahir) పూజానే డామినేట్ చేస్తున్నాడు. హీరోయిన్‌తో పోటీపడుతూ స్టెప్పులేశాడు. ఆ క్లిప్పింగ్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ నటుడిని మీరు గుర్తుపట్టే ఉంటారు. మలయాళ సూపర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్‌లో యాక్ట్ చేశాడు. ఇప్పుడు మోనికా పాటలో సింపుల్ లుక్‌లోనే సూపర్ స్టెప్పులేస్తూ ఫుల్ హైలైట్ అవుతున్నాడు. స్పెషల్ సాంగ్‌లో సౌబిన్‌తో స్టెప్పులేయించాలన్న ఆలోచన రావడమే గ్రేట్ అంటూ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ను నెటిజన్లు పొగుడుతున్నారు.
చదవండి: 'బిగ్‌బాస్'లో టాలీవుడ్ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆమె కూడా!