
బిగ్‌బాస్ (Bigg Boss Reality Show) మొదలవడానికి రెండు నెలల ముందు నుంచే హంగామా మొదలైపోతుంది. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభమయ్యేట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఇమ్మాన్యుయేల్, అలేఖ్య పికిల్స్ చెల్లెలు రమ్య, దెబ్జానీ, రీతూ చౌదరి, శివకుమార్, సాయికిరణ్, ముకేశ్ గౌడ సహా పలువురిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అలాగే కామన్ మ్యాన్ కేటగిరీలో ఇద్దరుముగ్గురిని హౌస్‌లోకి పంపించనున్నారు.
బిగ్‌బాస్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు
తాజాగా పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి, నువ్వునేను హీరోయిన్ అనిత హస్సానందని కూడా బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాకపోతే వీరిద్దరితో సంప్రదింపులు జరుపుతోంది తెలుగు బిగ్‌బాస్ టీమ్ కాదట! హిందీ బిగ్‌బాస్ టీమ్! హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ ఆగస్టు నెలాఖరులో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈసారి హౌస్‌లోకి వెళ్లేది వీరేనంటూ పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.
కంటెస్టెంట్లు వీళ్లేనా?
ఆ జాబితా ఓసారి చూసేద్దాం.. నటి మున్మున్ దత్తా, ఆలిషా పన్వర్, కనిక మన్, అరిష్ఫా ఖాన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అపూర్వ ముఖిజ, మిస్టర్ ఫైజు, యూట్యూబర్ గౌరవ్ తనేజా, పురవ్ జా, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (హీరోయిన్ శిల్పా శెట్టి భర్త), నటుడు ధీరజ్ ధూపర్, పరాస్ కల్నవత్, కృష్ణ ష్రాఫ్ (జాకీ ష్రాఫ్ కూతురు), సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ, కవలలు చింకీ-మింకీ ఉన్నారట!
సన్యాసం తీసుకున్న ఆమె కూడా!
వీరే కాకుండా లతా సబర్వాల్ (ఈమె తెలుగులో కొంచెం కొత్తగా మూవీలో నటించింది), తనుశ్రీ దత్తా (వీరభద్ర సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది), ఆశిష్ విద్యార్థి (టాలీవుడ్ విలన్), హీరోయిన్ అనిత కూడా ఉన్నారంటూ ఈ జాబితా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్న మమతా కులకర్ణి సైతం బిగ్‌బాస్‌కు వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె తెలుగులో ప్రేమ శిఖరం, దొంగాపోలీస్ సినిమాల్లో కథానాయికగా నటించింది. మరి ఫైనల్ జాబితాలో వీరిలో ఎంతమంది ఉంటారనేది చూడాలి!
చదవండి: హీరోను తిట్టా, కొట్టా.. సారీ మాత్రం చెప్పను: దర్శకురాలు