
రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా (Coolie Movie)కు భారీగా ప్రమోషన్లు చేశారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున తొలిసారి విలన్‌గా నటించడం.. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించడంతో ఈ మల్టీస్టారర్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వస్తోంది.
ఓటీటీ వివరాలు
ఇకపోతే ఈ సినిమా డిజటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్లకు ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే కూలీ ఓటీటీలోకి రానుంది. అయితే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుందంటే మాత్రం ఇంకా ముందే ఓటీటీలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
చదవండి: రజినీకాంత్ 'కూలీ' సినిమా రివ్యూ