
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కూలీ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రజినీకాంత్ హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో కింగ్ నాగార్జున, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. లోకేశ్ కనగరాజ్- రజినీకాంత్ కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.
కూలీ రిలీజ్కు ముందు దర్శకుడు ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలోని అరుణాచలం ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆలయంలో లోకేశ్ను చూసిన పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా లోకేశ్ కనగరాజ్ స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశారు.
రజినీకాంత్ హీరోగా నటించిన కూలీలో నాగార్జున విలన్‌గా కనిపిచనున్నారు. బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ సైతం కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అంచనాలు మరింత పెంచేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2తో పోటీ పడనుంది.
திருவண்ணாமலை அண்ணாமலையார் கோயிலில் சாமி தரிசனம் செய்த #lokeshkanagaraj #coolie
#coolieunleashed #rajinikanth #thiruvannamalai #nagarjuna #aamirkhan #soubinshahir #upendra #anirudhravichander #anirudh #kalanithimaran #sathyaraj #shruthihaasan #powerhouse #monica #disco… pic.twitter.com/Sj9rN7YRIh— Cineulagam (@cineulagam) August 7, 2025