‘కూలీ’ మూవీ ట్విటర్‌ రివ్యూ.. సెకండాఫ్‌లో నిద్రపోవడమే | Rajinikanth Coolie Movie Twitter Review In Telugu, Check These Tweets Before Watching The Film | Sakshi
Sakshi News home page

Coolie Movie Twitter Review: ‘కూలీ’ మూవీకి ఊహించని టాక్‌

Aug 14 2025 6:41 AM | Updated on Aug 14 2025 9:34 AM

Coolie Movie Public Talk And Twitter Review

సాధారణంగానే రజనీకాంత్‌ సినిమాలకి తమిళ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ ఎత్తున అభిమానులు ఉంటారు. ఇక ఆయన సినిమాలో నాగార్జున లాంటి స్టార్‌ హీరో విలన్‌గా నటిస్తే..ఇక్కడ అంచనాలు పెరిగిపోవడం స్వరసాధారణమే. అందుకే కూలీ సినిమాపై మొదటి నుంచి టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(ఆగస్ట్‌ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల బొమ్మపడిపోయింది. 

సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్స్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఎలా ఉంది? విలన్‌గా నాగార్జున మెప్పించాడా? రజనీకాంత్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందా? తదితర విషయాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. కూలీ సినిమా పవర్-ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్ అంటూ ఎక్కువమంది ప్రశంసిస్తున్నారు. రజినీకాంత్ నటన, సినిమా కథ, కథనం బాగున్నాయని  ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకు రజనీకాంత్‌తో పాటు నాగార్జున పాత్ర బాగా సెట్‌ అయిందని చెబుతున్నారు. ఆయన విలనిజం కథకు చాలా బలంగా ఉందని తెలుపుతున్నారు.  అయితే, సెకండాఫ్‌ మాత్రం పరమ చెత్తగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్వెల్‌ తర్వాత నిద్రపోవడమే అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో కూలీ, వార్‌2 సమరంలో వార్‌2 బాగుందని ఎక్కువమంది తెలుపుతున్నారు.

 

కూలీ సినిమా కోసం దర్శకుడు లోకేష్ టేకింగ్ అదుర్స్‌ అంటున్నారు. ఇందులో రజనీకాంత్‌ను ఆయన సరికొత్తగా చూపారని కామెంట్లు చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు, అలాగే సినిమాలో ఉత్కంఠను కొనసాగించిన విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వాటికి తోడుగా అనిరుధ్ మ్యూజిక్ బాగా కలిసొచ్చిందని తెలుపుతున్నారు. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి జీవం పోసిందని అభిప్రాయపడిని నెటిజన్లు  ప్రతి ఎలివేషన్ సీన్‌కి అదిరిపోయే రీసౌండ్‌ ఇచ్చాడని అంటున్నారు.

తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన క్రిస్టోఫర్ కనగరాజ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఎప్పటికప్పుడు సినిమా విశేషాలు, కలెక్షన్స్‌ వివరాలు ఆయన ప్రకటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన రజనీకాంత్‌ను అభిమానించేలా ఎక్కువ ట్వీట్లు కనిపిస్తుంటాయి. అయితే, తాజాగా ఆయన కూలీ సినిమా గురించి ఇచ్చిన రివ్యూ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. సినిమా యావరేజ్‌ మాత్రమే అంటూ రివ్యూలో పేర్కొన్నారు. నాగార్జున చాలా స్టైలిష్‌గా   ఉన్నప్పటికీ ఆయన పాత్ర సరిగ్గా సెట్‌ కాలేదని తెలిపారు. రజనీకాంత్‌ పాత్ర మాత్రమే పర్వాలేదని చెప్పిన ఆయన సినిమాలో ఇంకేమీ లేదన్నారు. అయితే, అనిరుధ్‌ మ్యూజిక్‌ అద్భుతమని చెప్పుకొచ్చారు. 

 

"కూలీ" సినిమా ఫస్టాప్‌ వరకు మాత్రమే పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తుంది. ఇంటర్వెల్‌ తర్వాత కూలీ ట్రాక్‌ మారిందని అభిప్రాయపడ్డారు. అయితే, కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నాయని, వాటిని రజనీకాంత్ నటనతో పాటు, నాగార్జున, లోకేష్ డైరెక్షన్  కవర్ చేశారని అంటున్నారు. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్‌కు ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.

కొంతమంది మాత్రం కూలీ సినిమా కథ చాలా బోరింగ్‌ అంటున్నారు. సినిమా కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుందని దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలుపుతున్నారు. 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement