
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబోపై తలైవా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ తేదీ ప్రకటించిన మేకర్స్.. ప్రమోషన్స్ జోరు పెంచేశారు.
ఈ నేపథ్యంలోనే పవర్‌ఫుల్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే తమిళ వర్షన్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు వర్షన్లో లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. పవర్‌హౌస్ పేరుతో వచ్చిన ఈ పాట ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
(ఇది చదవండి: రజినీకాంత్ కూలీ ట్రైలర్ అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?)
కాగా.. కూలీ ట్రైలర్ను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.