
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ 'కూలీ'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మోనికా సాంగ్‌తో పూజా హెగ్డే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడనుండడంతో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్.
తాజాగా కూలీ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. కూలీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఆగస్టు 2వ తేదీన ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా.. ఇటీవలే విడుదలైన పవర్ హౌస్ సాంగ్ రజినీకాంత్ ఫ్యాన్స్‌ను, ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
The wait is over! The highly anticipated #Coolie Trailer from August 2💥#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges… pic.twitter.com/DWERTKRaGL
— Sun Pictures (@sunpictures) July 28, 2025