‍అఫీషియల్: 'కూలీ' రిలీజ్ డేట్.. 'వార్ 2'తో పోటీ | Rajinikanth Coolie Movie Release Date Latest | Sakshi
Sakshi News home page

Coolie Release Date: ఎన్టీఆర్ కి పోటీగా రజనీకాంత్.. ఇట్స్ కన్ఫర్మ్

Apr 4 2025 6:18 PM | Updated on Apr 4 2025 6:40 PM

Rajinikanth Coolie Movie Release Date Latest

కొన్నిరోజుల నుంచి అనుకున్నదే జరిగింది. సూపర్ స్టార్ రజినీకాంత్ 'కూలీ' (Coolie Movie).. ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాకు పోటీగా నిలిచింది. సాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

 (ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)

లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagraj) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఉ‍న్నాడని సమాచారం. ఇదివరకే షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించారు. ఆగస్టు అంటే చాలా టైమ్ ఉంది కాబట్టి అన్ని పనులు అంతలోపు పూర్తి చేస్తారు.

మరోవైపు ఆగస్టు 14నే ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ మూవీ వార్ 2 (War 2 Movie) రాబోతుంది. ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో. నార్త్ లో దీనికి పెద్దగా పోటీ ఉండకపోవచ్చు గానీ దక్షిణాదిలో మాత్రం 'కూలీ' పోటీ గ్యారంటీ. తొలుత కూలీ వారం లేటుగా రావొచ్చేమో అ‍న్నారు కానీ లాంగ్ వీకెండ్ దృష్ట్యా ఆగస్టు 14నే వస్తామని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో రజినీ vs తారక్ ఖరారైంది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్)

Advertisement
 
Advertisement
Advertisement