
రజినీకాంత్ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం కూలీ. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ పాత్రలో మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. పూజాహెగ్డే తన డ్యాన్స్తో మెప్పించిన మోనికా ఫుల్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలో సౌబిన్ షాహిర్ ఆడియన్స్ను మెప్పించారు.
కాగా.. పాటను తమిళంతో పాటు మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వర్షన్స్ కూడా విడుదల చేశారు. గతంలో కుర్రకారును ఓ రేంజ్‌లో ఊపేసిన మోనికా ఫుల్ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి. మరోవైపు ఈ సూపర్ హిట్ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ వంటి స్టార్స్ నటించారు. ఈ సినిమా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ -2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సంగతి తెలిసిందే.
Finally, Our Monica Bellucci erangi vandhachi 💃🏻 #Monica video song is out now! 💘
Tamil ▶️ https://t.co/HqBfqY7Adb
Telugu ▶️ https://t.co/tnMJvrUCZB
Hindi ▶️ https://t.co/SDtC7RjCdy
Kannada ▶️ https://t.co/BrwN1rAbV7
Malayalam ▶️ https://t.co/viT48NIpOR@rajinikanth… pic.twitter.com/Qoy1Y3rhdc— Sun Pictures (@sunpictures) September 11, 2025