
ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. ఆగస్టు 14న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2', రజనీకాంత్ 'కూలీ' చిత్రాలు విడుదలవుతున్నాయి. రెండూ ఒకేరోజు వస్తుండటంతో ఏ మూవీ చూసేందుకు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు సినీప్రియులు. హీరో మంచు మనోజ్ (Manchu Manoj) కూడా ఇదే ఇరకాటంలో పడ్డాడు. 'అవ్వ కావాలా? బువ్వ కావాలా?'.. అచ్చంగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నా.. జోక్స్ పక్కనపెడితే కూలీ, వార్ 2.. ఒకేరోజు రిలీజవ్వడమనేది ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రత్యేకం.
20 మందిని తీసుకెళ్తా..
రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినీ ప్రియులకు ఇదొక క్రేజీ డే. మీరు ఏ సినిమాకు ముందుగా వెళ్తున్నారో చెప్పండి. దాన్ని బట్టి నేను ఏది ఫస్ట్ చూడాలని నిర్ణయించుకుంటాను. అంతేకాదు, మీ కామెంట్లలో నుంచి ర్యాండమ్‌గా 20 మందిని సెలక్ట్ చేసి నాతోపాటు మిమ్మల్ని కూడా సినిమాకు తీసుకెళ్తా.. మనం కలిసి మూవీ చూసి ఎంజాయ్ చేద్దాం. మాటిస్తున్నా అని ట్వీట్ చేశాడు. అలాగే వార్ 2 చిత్రయూనిట్‌కు, కూలీ మూవీ యూనిట్‌కు ఆల్‌ద బెస్ట్ చెప్పుకొచ్చాడు.
“Avva kavala, buvva kavala” ani adagadam lanti situation lo unnanu! 😄
Jokes apart, what a historic day for Indian cinema 🎦 🙏🏼❤️🎸💥 #Coolie and #War2 releasing together. Wishing both these cinematic magics to become all-time blockbusters and roar across INDIA. Proud, crazy day… pic.twitter.com/hJBCmedeyx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 13, 2025
చదవండి: బిగ్‌బాస్ అగ్నిపరీక్ష డేట్ వచ్చేసింది.. హోస్ట్ నాగార్జున కాదు!