
తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమా (Mirai Movie) భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఎడారిలో ఒయాసిస్సులా.. ఫ్లాపులతో సతమతమవుతున్న మంచు మనోజ్‌కు సక్సెస్ దొరికినట్లైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ గ్రాండ్‌గా ఉండటం సినిమాకు మరింత ప్లస్సయింది.
చివరిసారి ఎప్పుడు చూశానో..
ఈ సినిమా చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎక్స్ (ట్విటర్) వేదికగా రివ్యూ ఇచ్చారు. మిరాయ్ చూశాక.. ఇంత మంచి వీఎఫ్‌ఎక్స్ ఉన్న సినిమా చివరిసారి ఎప్పుడు చూశానో గుర్తు రావడం లేదు. రూ.400 కోట్లకుపైగా ఖర్చు పెట్టి తీసిన సినిమాల్లోనూ ఇంత గ్రాండ్ విజువల్స్ చూడనేలేదు. ముందుగా మనోజ్‌ను ఈ సినిమాలో విలన్‌గా తీసుకుని తప్పు చేశారనుకున్నాను. కానీ సినిమా చూశాక అతడి పర్ఫామెన్స్ చూసి నన్ను నేనే కొట్టుకున్నా..
నా అంచనా తప్పు
ఇంత పెద్ద యాక్షన్ అడ్వెంచర్ మూవీలో తేజ మరీ చిన్నపిల్లాడిలా కనిపిస్తాడేమో అనుకున్నా.. ఇక్కడ కూడా నా అంచనా తప్పయింది. విజువల్స్, బీజీఎమ్, స్క్రీన్‌ప్లే.. అన్నీ అదిరిపోయాయి. ఇంటర్వెల్ సహా మరికొన్ని చోట్ల సినిమా నెక్స్ట్ లెవల్‌కు వెళ్లింది. కత్తులు, అతీంద్రియ శక్తుల బెదిరింపుల మధ్యలో ప్రేమ, మోసం వంటి అంశాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించారు.
లాభాలొక్కటే కాదు..
కార్తీక్.. మిరాయ్ మీరు కన్న అద్భుతమైన కల. పురాణాలను, హీరోయిజాన్ని కలగలిపి చూపించారు. అన్ని విభాగాలపై మీకున్న పట్టు వల్లే ఇది సాధ్యమైంది. విశ్వప్రసాద్.. మీరు సినిమా బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాకపోయినా మీకున్న ప్యాషన్ వల్లే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. ఇండస్ట్రీ పెద్దలు వార్నింగ్ ఇచ్చినా లెక్కచేయలేదు, మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు. తద్వారా విజయం సాధించారు. లాభాలు తీసుకురావడమే కాదు, జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించడం కూడా చిత్రయూనిట్ బాధ్యత అని నిరూపించారు.
మనోజ్ రిప్లై
చివరగా నేను చెప్పేదేంటంటే.. ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అని రాసుకొచ్చారు. దీనికి మంచు మనోజ్ (Manchu Manoj).. అన్నా, మీ స్పంద చూస్తుంటే నాకు గూస్‌బంప్స్ వస్తున్నాయి. చిన్నప్పటినుంచి మీ సినిమాలు చూస్తూ, మీతో కలిసి పనిచేస్తూ పెరిగాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇప్పుడు మీ నోటి నుంచి నా నటనకు ప్రశంసలు దక్కుతుంటే సంతోషంగా ఉంది అని రిప్లై ఇచ్చాడు.
Annaaaa …..reading this from you gave me goosebumps 🙏🏻 I grew up watching your cinema, working with you, learning from it and today to hear you speak of my performance like this… it’s beyond special ❤️ thank you anna 🙏🏼🙌🏽#Mirai #BlackSword https://t.co/y9hfmJUGkR
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 14, 2025
చదవండి: ఆ నలుగురు ఫేక్.. నమ్మకం పోతే మళ్లీరాదంటూ ఏడ్చేసిన శ్రష్టి