ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టిన 'మిరాయ్‌' | Teja Sajja’s Mirai Movie Joins ₹100 Crore Club in Just 5 Days | Sakshi
Sakshi News home page

Mirai Movie: రూ.100 కోట్ల క్లబ్బులో చేరిన మిరాయ్‌

Sep 17 2025 12:38 PM | Updated on Sep 17 2025 1:14 PM

Teja Sajja, Manchu Manoj Mirai Movie Enters into Rs 100 cr Club

హను-మాన్‌ మూవీతో సూపర్‌ హిట్‌ అందుకున్న తేజ సజ్జ 'మిరాయ్‌' మూవీ (Mirai Movie)తో మరో బ్లాక్‌బస్టర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. తేజ ప్రధాన పాత్రలో నటించిన మిరామ్‌ మూవీలో మంచు మనోజ్‌ విలన్‌గా నటించాడు. రితికా నాయక్‌ హీరోయిన్‌గా యాక్ట్‌ చేయగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, కృతీ ప్రసాద్‌నిర్మించిన ఈ మూవీకి హరి గౌర సంగీతం అందించాడు. 

సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. మిరాయ్‌ రూ.100 కోట్లు కొల్లగొట్టిందంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. టికెట్‌ రేట్లు పెంచకుండానే మిరాయ్‌ ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టడం విశేషం! గొప్ప మనసుతో సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులకు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు మనోజ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఇది మంచి సినిమా సాధించిన విజయం అని అభివర్ణించాడు.

 

 

చదవండి: దయచేసి ఎక్కడికీ వెళ్లొద్దు బ్రదర్‌.. మహేశ్‌బాబు రిక్వెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement