నటుడు శివాజీ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ యాంకర్ సుమ కనకాల స్పందించింది. మహిళలకు రక్షణ కల్పించడం.. ఆంక్షలు పెట్టడం ఒక్కటి కాదని తెలిపింది. ఇటీవలే తాను ఎకో అనే మూవీ చూశానని వెల్లడించింది. సినీ ఇండస్ట్రీలో ఇటీవల నిధి అగర్వాల్, సమంతకు జరిగిన సంఘటనలు మనకు హెచ్చరికలాంటివని సుమ తెలిపింది. ఇలాంటివీ చూస్తుంటే మహిళలకు భద్రత, గౌరవం ఎక్కడుందని ఆమె ప్రశ్నించింది. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిని వదిలేయడం అంటే ఇంకా పెంచి పోషించడమేనని యాంకర్ రాసుకొచ్చారు. ఈ సంఘటనలను మహిళలు ప్రశ్నిస్తూనే ఉంటారని సుమ తన పోస్ట్‌లో స్పష్టం చేసింది.
హీరోయిన్ల దుస్తులపై శివాజీ కామెంట్స్..
శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడారు. నటీమణుల దుస్తులపై ఆయన కామెంట్స్ చేశారు. సామాన్లు కనపడేలా డ్రెస్సులు ధరించొద్దని.. చీరలోనే అందంగా ఉంటారని వెటకారంగా అన్నారు. అదే సమయంలో కొన్ని అసభ్యకర పదాలు వాడారు. దీంతో శివాజీ చేసిన కామెంట్స్‌పై అనసూయ, చిన్మయితో సహా పలువురు సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికీ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశాడు శివాజీ.
Recently watched a film called eko which says Protection and restriction are not the same. pic.twitter.com/5ozSvvYUhq
— Suma Kanakala (@ItsSumaKanakala) December 23, 2025


