హీరోయిన్లపై శివాజీ చిల్లర వ్యాఖ్యలు.. సారీ చెప్పిన టాలీవుడ్ హీరో | Tollywood Hero Manchu Manoj Apologises To womens about Shivaji Comments | Sakshi
Sakshi News home page

Shivaji: హీరోయిన్లపై శివాజీ చిల్లర వ్యాఖ్యలు.. టాలీవుడ్ హీరో క్షమాపణలు

Dec 23 2025 3:56 PM | Updated on Dec 23 2025 4:36 PM

Tollywood Hero Manchu Manoj Apologises To womens about Shivaji Comments

టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్‌ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హీరోయిన్ల డ్రెస్‌లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో శివాజీపై మహిళ నటీమణులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిన్మయి శ్రీపాద, అనసూయ శివాజీ కామెంట్స్‌పై తమదైన శైలిలో స్పందించారు. సినీతారలతో పాటు నెటిజన్స్ సైతం శివాజీపై మండిపడుతున్నారు. ఈ టాపిక్‌ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. దండోరా మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తులను ఉద్దేశించి అసభ్యకర రీతిలో శివాజీ మాట్లాడిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించారు. శివాజీ పేరును ప్రసావించకుండానే ఆయన తరఫున క్షమాపణలు కోరుతూ నోట్ రిలీజ్ చేశారు. నిన్న రాత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయని తెలిపారు. ప్రస్తుత ఈ నాగరిక సమాజం మహిళల నిర్ణయాల, ఇష్టాలు, వారి హక్కులను పరిరక్షిస్తుందని మంచు మనోజ్ ట్వీట్‌ చేశారు.

మంచు మనోజ్ తన నోట్‌లో ప్రస్తావిస్తూ.. 'హీరోయిన్ల దుస్తులపై ఇలాంటి ప్రకటన చేయడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మహిళలు ఇలాంటి దుస్తులే మాత్రమే వేసుకోవాలి అని చెప్పడం ఏ మాత్రం సహించేది కాదు. వారి గౌరవం, జవాబుదారీతనం వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మాత్రమే తెలుస్తుంది. దుస్తుల ఆధారంగా కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చర్చలకు తావులేదు. ప్రజల అభిప్రాయం కోసం ఎవరు కూడా దుస్తులు ధరించరు. మహిళలను అగౌరవ పరిచేలా సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలకు నేను క్షమాపణ కోరుతున్నా. మహిళలను వస్తువుల్లా చూడొద్దు. ఇలాంటి కామెంట్స్ వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మహిళలకు గౌరవం, హోదా, సమానత్వం మనందరం ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీతనం అవసరం' అని రాసుకొచ్చారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement