చెప్పేవి శ్రీరంగ నీతులు..చేసేవి దొంగ పనులు అన్నట్లుగా ఉంది నటుడు శివాజీ పరిస్థితి. ఆడవాళ్లు ఇలా ఉండాలి? అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి? అని నీతులు చెప్పే ఈ సుద్దపూస.. తనవరకు వచ్చేసరికి ఇష్టం వచ్చినట్లుగా జీన్స్, హుడీలు వేసుకోని కుర్రహీరోలా రెడీ అయిపోతాడు. స్త్రీ అంటే ప్రకృతి.. తల్లి అంటూనే అదే నోటితో దరిద్రపు ము** అంటూ బూతులు మాట్లాడతాడు. చివరకు క్షమాపణలు చెబుతూనే.. తను చెప్పింది మంచి విషయమే కానీ వాడిన పదాలు తప్పు అంటాడు. మహిళలు ఇలాంటి దుస్తులే ధరించాలి..ఇలానే కనిపించాలి అని చెప్పేందుకు శివాజీ ఎవరు? ఎలా కనబడాలి? ఎలాంటి డ్రెస్ వేసుకోవాలనేది ముమ్మాటికి వాళ్ల హక్కే. ఇది శివాజీ లాంటి స్వయంప్రకటిత మేధావులకు ఎప్పుడు అర్థమవుతుందో..
బిగ్‌బాస్ హౌస్‌లో కూడా చిల్లర మాటలే
మహిళలపై ఇలాంటి చిల్లర కామెంట్స్ చేయడం శివాజీకి ఇదే మొదటిసారి కాదు. గతంలో బిగ్‌బాస్ షోలో కూడా తోటి కంటెస్టెంట్స్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. నటుడుగా తన పేరు కనుమరుగు అవుతున్న సమయంలో బిగ్‌బాస్ 7 షోతో మళ్లీ వెలుగులోకి వచ్చాడు శివాజీ. అక్కడ కూడా ఆట కంటే ఎక్కువగా ఇలాంటి మాటలతోనే పబ్బం గడిపాడు. బిగ్‌బాస్ 7లో పాల్గొన్న శోభ, రతిక, ప్రియాంక, అశ్వినితో పాటు మిగిలినవారంతా శివాజీ ప్రవర్తనను, మాటలను తప్పుపట్టారు.
(చదవండి: హీరోయిన్ల డ్రెస్‌పై శివాజీ వ్యాఖ్యలు... అనసూయ పోస్ట్ వైరల్)
ఒకనొక సమయంలో అయితే అతని మాటలపై గట్టిగా సీరియస్ అయ్యారు కూడా. బిగ్‌బాస్ 7 పదో వారం..గేమ్‌లో భాగంగా హౌస్‌లో ఉన్న రతిక, ప్రియాంక, శోభ, అశ్వినిలను రాజమాతలుగా బిగ్‌బాస్ నియమిస్తే.. ‘నా మాట వినకపోతే ***పగుల్తాయ్’ అంటూ అనవసరంగా నోరు పారేసుకున్నాడు. అదే షోలో ప్రియాంకతో కూడా శివాజీ దురుసుగా ప్రవర్తించాడు. ఓ వారం అతన్ని నామినేట్ చేస్తూ.. ‘ఎదుటి వాళ్లని మాట్లాడనీయకుండా దబాయిస్తున్నాడు’ అని ప్రియాంక అంటే.. ఆమెపై వేలు ఎత్తి చూపిస్తూ.. వెళ్లు వెళ్లు అంటూ వెతకారంగా మాట్లాడాడు. వేలు చూపించడం సరికాదంటూ ప్రియాంక సీరియస్ అయితే.. ‘నీకంత లేదమ్మా’ అంటూ హేళన చేస్తూ మాట్లాడాడు.
ఏమైనా సంబంధం ఉందా ‘ఛీ’వాజీ
తాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యలు కూడా మీడియా అటెన్షన్ కోసమే అన్నట్లుగా ఉంది. వాస్తవానికి నిన్న శివాజీ వెళ్లింది దండోరా సినిమా ఈవెంట్. అక్కడ సినిమా గురించి మాట్లాడాలి. కానీ అది వదిలేసి.. అమ్మాయిల డ్రెస్‌పై కామెంట్స్ చేశాడు. ఆడవాళ్ల దుస్తులకు.. ఆయన నటించిన సినిమాకు ఏమైనా సంబంధం ఉందా? పోనీ గతంలో శివాజీ నటించిన సినిమాల్లో హీరోయిన్లు అంతా చీరలు ధరించే కనిపించారా? ఏదో ఒకటి మాట్లాడి మీడియాలో అటెన్షన్ తెచ్చుకోవాలన్న కోరికతోనే శివాజీ అలాంటి చిల్లర వ్యాఖ్యలు చేశాడు.
అదో పిచ్చి..
మీడియాలో తన పేరు వినిపించాలనే పిచ్చి శివాజీకి కాస్త ఎక్కువే. తనకు సంబంధం లేని విషయాల్లో దూరి.. ‘నేను తోపు.. తురుమ్ ఖాన్’ అని గప్పాలు కొట్టుకుంటాడు. రాజకీయాల గురించి ఇంగిత జ్ఞానం కూడా లేని శివాజీ.. 2019 ఎన్నికల ముందు గరుడ పురాణమంటూ ఓ కట్టుకథను అల్లి చంద్రబాబు మెప్పు పొందే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. అనంతరం బీజేపీలో చేరాడు. ఆ విషయం పార్టీతో పాటు జనాలు కూడా మర్చిపోయారు. ఇప్పుడు రాజకీయాలు వదిలేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. ఈ మధ్యే శివాజీ ఇంకా నటుడుగా కొనసాగుతున్నాడన్న విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పుడు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తే.. తనకు గుర్తింపు వచ్చి..మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశతో శివాజీ ఉన్నాడు. చాన్స్‌ల కోసం ఇంతకు దిగజారాలా ‘ఛీవాజీ’


