'రాజుగారి పెళ్లిరో'.. వెడ్డింగ్ సాంగ్‌ ప్రోమో వచ్చేసింది | Naveen Polishetty Anaganaga Oka Raju Movie Latest somng Promo Out now | Sakshi
Sakshi News home page

Anaganaga Oka Raju Movie: 'రాజుగారి పెళ్లిరో'.. వెడ్డింగ్ సాంగ్‌ ప్రోమో వచ్చేసింది

Dec 23 2025 8:52 PM | Updated on Dec 23 2025 8:55 PM

Naveen Polishetty Anaganaga Oka Raju Movie Latest somng Promo Out now

టాలీవుడ్ హీరో నవీన్‌ పొలిశెట్టి సంక్రాంతి బరిలో నిలిచాడు. ఆయన హీరోగా వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ అనగనగా ఒక రాజు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. రిలీజ్‌ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మారి దర్శకత్వంలో తెరకెక్కించారు.

తాజాగా రిలీజైన రాజు గారి పెళ్లిరో అంటూ సాగే పాట ప్రోమో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement