బిగ్‌బాస్‌ అ‍గ్నిపరీక్ష డేట్‌ వచ్చేసింది.. హోస్ట్‌ నాగార్జున కాదు | Bigg Boss 9 Agnipariksha Launching Date Announce, Watch Promo | Sakshi
Sakshi News home page

OTT: రెండువారాలపాటు బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష.. హోస్ట్‌ నాగార్జున కాదు!

Aug 13 2025 6:43 PM | Updated on Aug 13 2025 7:48 PM

Bigg Boss 9 Agnipariksha Launching Date Announce, Watch Promo

ప్రతి ఏడాది బిగ్‌బాస్‌ షో (Bigg Boss Reality Show) కోసం ఎదురుచూస్తారు. కానీ ఈసారి సీజన్‌ 9 కన్నా ముందు బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఏదో తూతూమంత్రంగా కామనర్స్‌ను సెలక్ట్‌ చేయడం లేదు. వారికంటూ ప్రత్యేకంగా ఓ షో పెట్టి.. అందులో పోటీలు నిర్వహించి, జడ్జిల నిర్ణయాల ఆధారంగా సామాన్యులను ఎంపిక చేస్తారన్నమాట!

వచ్చేవారమే అగ్నిపరీక్ష
తాజాగా ఈ అగ్నిపరీక్ష వివరాలు వెల్లడిస్తూ ఓ ప్రోమో రిలీజ్‌ చేశారు. బిగ్‌బాస్‌ 4వ సీజన్‌ విన్నర్‌ అభిజిత్‌, నాన్‌స్టాప్‌ (ఓటీటీ) సీజన్‌ విజేత బిందు మాధవి, ఫస్ట్‌ సీజన్‌ థర్డ్‌ రన్నరప్‌ నవదీప్‌ జడ్జిలుగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు. ఈ షో ఆగస్టు 22నుంచి సెప్టెంబర్‌ 5 వరకు ప్రతిరోజు హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిపరీక్షకు యాంకర్‌ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించనుంది. మరి ఈ షోలో ఎవరెవరు పాల్గొననున్నారు? ఎలా ఉండబోతోంది? అన్నది తెలియాలంటే ఇంకో 9 రోజులు ఆగాల్సిందే!

 

చదవండి: థైరాయిడ్‌ క్యాన్సర్‌.. సర్జరీ తర్వాత గొంతు మూగబోయింది: యాంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement