
రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం 'కూలీ'... ప్రపంచవ్యాప్తంగా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇందులో భారీ తారాగణమే ఉంది. అయితే, సినిమా క్లైమాక్స్‌లో ఆమిర్ ఖాన్ పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సుమారు 10 నిమిషాలకు పైగా ఉన్న ఆ సీన్ కోసం ఆయన ఏకంగా రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా ఆమిర్ రియాక్ట్ అయ్యారు.
కూలీ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించిన ఆమిర్ ఖాన్ తన రెమ్యునరేషన్ గురించి తాజాగా రియాక్ట్ అయ్యారు. ఈ చిత్రం కోసం తాను డబ్బు తీసుకోలేదని చెప్పాడు. కేవలం రజనీకాంత్ కోసం మాత్రమే ఇందులో నటించానని తెలిపాడు. ఆపై కూలీ చిత్ర యూనిట్ మీద ఉన్న ప్రేమ వల్ల జీరో రెమ్యునరేషన్‌తో తన రోల్ పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చాడు. రజనీకాంత్ మీద ఉన్న ప్రేమ వల్ల కూలీ సినిమా కథ కూడా వినకుండా ఓకే చెప్పానని ఆమిర్‌ఖాన్ గుర్తుచేశాడు. తన కెరీర్‌లో చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి స్క్రిప్ట్ వినకుండా ఒక సినిమాకు ఓకే చెప్పానన్నాడు.
భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. మొదటిరోజు ఏకంగా రూ. 151 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండురోజుల్లో రూ. 230 కోట్ల గ్రాస్ దాటినట్లు తెలుస్తోంది. ఇందులో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రచితా రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.